Cabinet meet: కొత్త ప్రభుత్వంలో 100 రోజుల ప్రణాళిక సిద్ధం చేయండి.. మంత్రులకు మోదీ పిలుపు

వచ్చే ఐదేళ్ల పాటు ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణను రూపొందించాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సూచించారు.

Published : 17 Mar 2024 22:23 IST

దిల్లీ: కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలి 100 రోజులతో పాటు తదుపరి ఐదేళ్ల పాటు ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యాచరణను రూపొందించాలని కేంద్ర మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సూచించారు. ఇందుకోసం ఆయా మంత్రిత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపాలన్నారు. ఆదివారం ఉదయం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు ఈ సూచనలు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) షెడ్యూల్‌ ప్రకటించిన మరుసటి రోజే కేబినెట్‌ భేటీ కావడం గమనార్హం.

ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల తేదీలను ప్రకటించే ప్రక్రియను కూడా కేబినెట్‌ ప్రారంభించింది. వీటికి సంబంధించి ఈసీ వెల్లడించిన షెడ్యూల్‌ను రాష్ట్రపతికి పంపించనుంది. ఏప్రిల్‌ 19 జరిగే 102 లోక్‌సభ స్థానాలకు గానూ మార్చి 20న తొలి నోటిఫికేషన్‌ జారీ కానుంది. ఆయా దశల ఎన్నికలకు ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని