CBSE 10th Result: సీబీఎస్‌ఈ ‘పది’ ఫలితాలు ఇప్పుడే కాదు..!

సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) టర్మ్‌-2 పదో తరగతి ఫలితాలు ఈరోజు విడుదల చేయడంలేదని అధికారిక వర్గాలు స్పష్టంచేశాయి.........

Published : 04 Jul 2022 19:37 IST

దిల్లీ: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) టర్మ్‌-2 పదో తరగతి ఫలితాలు ఈరోజు విడుదల చేయడం లేదని అధికారిక వర్గాలు స్పష్టంచేశాయి. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు (CBSE 10th Result) విడుదల చేసే తేదీని బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కొన్ని సామాజిక మాధ్యమాల్లో మాత్రం జులై 4న ఫలితాలు అంటూ ప్రచారం జరిగింది. దీంతో సోమవారం ఫలితాలు ప్రకటించడంలేదని సీబీఎస్‌ఈ కంట్రోలర్‌ కార్యాలయ అధికారులు చెప్పినట్టు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, జులై 13 నాటికి పదో తరగతి ఫలితాలు, జులై 15 కన్నా ముందే 12వ తరగతి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా దాదాపు 35లక్షల మంది విద్యార్థులు పది, 12వ తరగతి ఫలితాలు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి మే 24 వరకు జరగ్గా.. 12వ తరగతి ఫలితాలు ఏప్రిల్‌ 26 నుంచి జూన్‌ 15వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలను cbseresults.nic.in, results.gov.inవెబ్‌సైట్‌లతో పాటు డిజీలాకర్‌ యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు తెలుసుకొనేందుకు విద్యార్థుల రోల్‌ నంబర్‌తో పాటు పుట్టిన తేదీ, పాఠశాల కోడ్‌ వంటి వివరాలను అందుబాటులో ఉంచుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని