Slavery: కొందరి పరిశుభ్రతకు మరికొందరు ‘బానిసలా’!: బాంబే హైకోర్టు

ఓ తరగతి పౌరుల పరిశుభ్రత అనేది మరో వర్గం వారిని బానిసత్వంలో నిమగ్నం చేయడం ద్వారా సాధించలేమని బాంబే హైకోర్టు (Bombay HC) పేర్కొంది.

Published : 14 Mar 2024 15:32 IST

ముంబయి: పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఓ కేసులో బాంబే హైకోర్టు (Bombay HC) కీలక వ్యాఖ్యలు చేసింది. సంక్షేమ ప్రభుత్వంలో ఓ తరగతి పౌరుల పరిశుభ్రత అనేది మరో వర్గం వారిని బానిసత్వంలో నిమగ్నం చేయడం ద్వారా సాధించలేమని పేర్కొంది. ఈసందర్భంగా 580 మంది మున్సిపల్‌ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి, వారికి అన్ని ప్రయోజనాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ముంబయి మున్సిపల్‌ విభాగంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తోన్న 580 మంది తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని కోరుతూ అక్కడి వర్కర్స్‌ యూనియన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. రోడ్లను ఊడ్చటం, చెత్త సేకరణ వంటి పనులు నిర్వర్తించే వీరికి శాశ్వత పోస్టులు సృష్టించాలంటూ ఇండస్ట్రియల్‌ ట్రైబ్యునల్‌ గతంలో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముంబయి (MCGM) హైకోర్టులో సవాలు చేసింది.

‘జమిలి ఎన్నికల’పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

విచారించిన జస్టిస్‌ మిలింద్‌ జాధవ్‌ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం.. ‘స్వచ్ఛమైన వాతావరణనేది పౌరుల ప్రాథమిక హక్కు. కానీ కార్మికుల మానవ గౌరవాన్ని కాలరాయడం ద్వారా దాన్ని సాధించలేం. సంక్షేమ ప్రభుత్వంలో ఒక తరగతి పరిశుభ్రత అనేది మరో వర్గాన్ని బానిసత్వంలో నిమగ్నం చేయడం ద్వారా సాధించలేం’ అని పేర్కొంటూ తీర్పు చెప్పింది. ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కొట్టివేయడమనేది ‘న్యాయాన్ని అపహాస్యం’ చేసినట్లే అవుతుందని అభిప్రాయపడింది. నవంబర్‌ 2023లో ఇచ్చిన ఈ తీర్పు తాజాగా అందుబాటులోకి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని