Gujarat: గుర్రంపై ఊరేగింపు.. దళిత వరుడిపై దాడి

వివాహ తంతులో భాగంగా గుర్రంపై ఉరేగింపుగా వెళుతున్న దళిత వరుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈసంఘటన గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లాలో జరిగింది.  

Published : 14 Feb 2024 00:26 IST

గాంధీనగర్‌: వివాహ తంతులో భాగంగా గుర్రంపై ఊరేగింపుగా వెళుతున్న ఒక దళిత వరుడిపై కొందరు దాడి చేశారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కులం పేరుతో తిట్టడమే కాకుండా కొట్టారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.  

వికాస్‌ చడ్వా తన వివాహ తంతులో భాగంగా సుమారు 100 మంది బంధువుల సమక్షంలో ఊరేగింపుగా వధువు ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ వ్యక్తి వరుడిని కులంపేరుతో దూషిస్తూ అతడిని అడ్డుకున్నాడు. గుర్రంపై నుంచి బాధితుడిని లాగి చెంపపై కొట్టాడు. తమ కులానికి చెందిన వారు మాత్రమై గుర్రంపై ఊరేగాలని తిట్టాడు. కొద్దిసేపటి తర్వాత మరోముగ్గురు వ్యక్తులు నిందితుడికి మద్దతుగా వచ్చి బాధితుడితో గొడవపడి బెదిరించారు. గుర్రం దిగి వాహనంలో వధువు ఇంటికి వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో బాధితుడి బంధువు మన్సా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులు శైలేజ్‌ ఠాకూర్‌, జయేశ్‌ ఠాకూర్‌, సమీర్‌ ఠాకూర్‌, అశ్విన్‌ ఠాకూర్‌పై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 341, 323, 504, 114, 506 (2) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని