
ఏయే దేశాలు ఎంత ఆహారం వృథా చేస్తున్నాయంటే!
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 2019లో 931 మిలియన్ల టన్నుల ఆహారం వృథా అయిందని ‘ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు 2021’నివేదికలో తేలింది. ప్రపంచ ఉత్పత్తిలో ఇది 17శాతంగా ఉంది. ఇళ్ల నుంచి 61శాతం, ఆహార సేవల కారణంగా 26శాతం, రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా 13శాతం ఆహార పదార్థాలు చెత్తబుట్టలోకి వెళ్తున్నాయని ఐరాస ఆవేదన వ్యక్తం చేసింది. మన భారతీయులు ఏటా 68మిలియన్ల టన్నుల ఆహారాన్ని పారేస్తున్నారట. భారత్‌లో తలసరిగా ఒక ఏడాదిలో ఒక ఇంటి నుంచి 50కిలోలు ఆహారం వృథా చేస్తున్నారు. మనకన్నా అధికంగా ఆహారం చెత్తపాలు చేస్తున్న దేశాలు చాలా ఉన్నాయి. సరాసరి 70 - 100 కిలోల ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు నివేదికలో తేలింది. మరి ఒక కుటుంబం ఏటా వృథా చేస్తున్న ఆహారం ఆధారంగా పేర్కొన్న కొన్ని ముఖ్యమైన దేశాలేవో చూద్దామా..?
నైజీరియా - 189 కిలోలు
గ్రీస్ - 142 కిలోలు
సౌదీ అరేబియా - 105 కిలోలు
ఆస్ట్రేలియా - 102 కిలోలు
కెన్యా - 99కిలోలు
మెక్సికో - 94 కిలోలు
ఇథియోపియా - 92 కిలోలు
మలేషియా - 91 కిలోలు
ఫ్రాన్స్ - 85 కిలోలు
కెనడా - 79 కిలోలు
ఇండోనేషియా, యూకే, స్పెయిన్ - 77 కిలోలు
వియత్నాం - 76 కిలోలు
జర్మనీ - 75 కిలోలు
పాకిస్థాన్ - 74 కిలోలు
కొలంబియా - 70కిలోలు
ఇటలీ - 67 కిలోలు
బంగ్లాదేశ్ - 65 కిలోలు
చైనా, జపాన్ - 64 కిలోలు
బ్రెజిల్ - 60 కిలోలు
యూఎస్ - 59 కిలోలు
పోలాండ్ - 56 కిలోలు
భారత్ - 50 కిలోలు
దక్షిణాఫ్రికా - 40 కిలోలు
రష్యా - 33 కిలోలు
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.