రెండో విడత స్వచ్ఛభారత్‌కు కేబినెట్‌ ఆమోదం

ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రామీణ స్వచ్ఛభారత్‌ మిషన్‌ రెండో విడత కార్యక్రమానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘రెండో విడత స్వచ్ఛభారత్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Published : 20 Feb 2020 01:13 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రామీణ స్వచ్ఛభారత్‌ మిషన్‌ రెండో విడత కార్యక్రమానికి కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ‘రెండో విడత స్వచ్ఛభారత్‌ మిషన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రెండో విడత కార్యక్రమం 2020-21 నుంచి 2024-25 వరకు కొనసాగుతుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.52,497 కోట్లు ఖర్చు చేయాలని అంచనా వేశాం. రెండో విడతలో బహిరంగ మల విసర్జన రహితంతో (ఓడీఎఫ్‌) పాటు తడి, పొడి చెత్త నిర్వహణ కూడా ఉంటుంది. ఈ ఓడీఎఫ్‌ ప్లస్‌ కార్యక్రమం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో కలిసి.. జల్‌శక్తి మిషన్‌ పూర్తయ్యేందుకు పనిచేస్తుంది. ఈ కార్యక్రమం ప్రతిఒక్కరూ శౌచాలయం ఉపయోగించే దిశగా ముందుకు తీసుకెళ్తుంది’’ అని పేర్కొంది.

గ్రామీణ స్వచ్ఛ కార్యక్రమం 2014 అక్టోబర్‌ 2న ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు దీని కింద మొత్తం 10కోట్ల శౌచాలయాలను నిర్మించారు. దీని ఫలితంగా 2019 అక్టోబర్‌ 2న అన్ని రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలు బహిరంగ మలవిసర్జన రహితమైనవి (ఓడీఎఫ్‌)గా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని