
టర్కీకి భారత్ హెచ్చరిక..!
అంతర్గత అంశాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు
జెనీవా: పాకిస్థాన్ మిత్రదేశం టర్కీకి భారత్ చురకలంటించింది. ఇండియా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. దిల్లీ ఘటనల్ని ఉద్దేశిస్తూ ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ భారత్‌పై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జెనీవాలో జరుగుతున్న ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం 43వ వార్షికోత్సవం వేదికగా భారత్ దీటుగా సమాధానం చెప్పింది. ప్రజాస్వామ్య విలువల్ని అర్థం చేసుకొని వ్యవహరించాలని హితవు పలికింది. సమావేశంలో పాకిస్థాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి రాజకీయం చేయాలని చూసింది. దీన్ని దీటుగా తిప్పికొట్టిన భారత ప్రతినిధి విమర్శ్ ఆర్యన్.. టర్కీకి సైతం చురకలంటించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని సైతం ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరించారు.
ఎర్డోగన్ భారత్‌పై లేనిపోని విమర్శలు చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలో కశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ఐరాస సాధారణ సమితి సమావేశంలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి విమర్శలపాలయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పైనా అర్థంలేని ఆరోపణలు చేశారు. ఇలా పలుసార్లు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, చట్టాలపై ఎలాంటి అవగాహన లేకుండానే వ్యాఖ్యలు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.