బంగ్లాదేశ్‌కు లక్ష హైడ్రాక్సీ మాత్రలు

కరోనాపై పోరులో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌కు లక్ష హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందులను అందించింది భారత ప్రభుత్వం‌. వాటితోపాటు 50 వేల జర్జికల్‌ గ్లౌజులను సైతం పంపించింది. కొవిడ్‌-19పై పోరులో సార్క్‌ అత్యవసర నిధిలో భాగంగా..

Published : 26 Apr 2020 22:41 IST

అందించిన భారత ప్రభుత్వం

దిల్లీ: కరోనాపై పోరులో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్‌కు లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను భారత్‌ ప్రభుత్వం అందించింది. వాటితోపాటు 50 వేల సర్జికల్‌ గ్లౌజులను సైతం పంపించింది. కొవిడ్‌-19పై పోరులో సార్క్‌ అత్యవసర నిధిలో భాగంగా పొరుగు దేశమైన బంగ్లాకు భారత్‌ సహాయం అదించడం ఇది రెండోసారి. గతంలో హెడ్‌ కవర్లు, మాస్కులను రవాణా చేసింది. ఈ సందర్భంగా ఢాకాలోని భారత హై కమిషనర్‌ రవి గంగూలీ దాస్‌ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ఆమె పేర్కొంటూ.. రెండు దేశాల్లో అనేక మంది కరోనా బారిన పడ్డారని, ఈ మహమ్మారిని నియంత్రించేందుకు భారత్‌ బంగ్లాదేశ్‌కు అండగా నిలుస్తోందన్నారు.

‘మార్చి 15న సార్క్‌ నేతల వీడియో కాన్ఫరెన్స్‌ జరిగింది. ఆ సమయంలోనే సార్క్‌ కొవిడ్‌-19 అత్యవసర నిధిని ఏర్పాటు చేశారు. ఆ నిధిలో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్‌ ప్రభుత్వానికి లక్ష హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందులు, వైద్య సిబ్బందికి అవసరమయ్యే 50 వేల సర్జికల్‌ గ్లౌజులను అందించాం’ అని వెల్లడించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో దాదాపు 5 వేల కరోనా కేసులు నమోదవ్వగా.. 140 మంది మృత్యువాతపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని