Coronavirus: పిల్లల్లో కరోనా కొత్త వేరియంట్‌ లక్షణాలు గుర్తింపు

కొవిడ్‌ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

Updated : 08 Apr 2023 08:10 IST

దిల్లీ: కొవిడ్‌ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గతంలో కరోనా బాధితుల్లో ఈ పరిస్థితి కనిపించలేదని పేర్కొన్నారు. కాబట్టి కొత్త వేరియంట్‌ వల్లే కళ్లలో పుసులు, దురద వస్తుండొచ్చని అభిప్రాయపడ్డారు. వీటికి అదనంగా- గతంలో ఉన్నట్లే అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఇప్పుడూ కరోనా బాధితుల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. దేశంలో కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ.1.16 లేదా ఆర్ట్కురుస్‌గా పిలిచే కొత్త వేరియంట్‌ కారణమని నిపుణలు అభిప్రాయపడుతున్న సంగతి గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని