Aaradhya Bachchan: ఆరాధ్య బచ్చన్‌ ఆరోగ్యంపై వదంతులు వ్యాప్తి చేయొద్దు: దిల్లీ హైకోర్టు ఆదేశం

ప్రముఖ బాలీవుడ్‌ దంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ ఆరోగ్యంపై తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేస్తున్న వీడియోలను యూట్యూబ్‌ వేదిక నుంచి తొలగించాలని గురువారం దిల్లీ హైకోర్టు.. గూగుల్‌ను ఆదేశించింది.

Updated : 21 Apr 2023 06:52 IST

దిల్లీ: ప్రముఖ బాలీవుడ్‌ దంపతులు అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యారాయ్‌ బచ్చన్‌ కుమార్తె ఆరాధ్య బచ్చన్‌ ఆరోగ్యంపై తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేస్తున్న వీడియోలను యూట్యూబ్‌ వేదిక నుంచి తొలగించాలని గురువారం దిల్లీ హైకోర్టు.. గూగుల్‌ను ఆదేశించింది. పిల్లల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం అనారోగ్యకరమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని ఈ సందర్భంగా న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆరాధ్య బచ్చన్‌ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ‘ఇక లేరు’ అంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు చేసున్న ప్రచారంపై చిన్నారి, ఆమె తండ్రి అభిషేక్‌బచ్చన్‌ వ్యాజ్యం వేశారు. దీనిపై గురువారం విచారించిన జస్టిస్‌ సి.హరిశంకర్‌.. ప్రతి చిన్నారిని గౌరవంగా చూడాలని, పిల్లల ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం సహించదని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్న అప్‌లోడర్ల వివరాలను తక్షణమే పిటిషనర్లకు తెలియజేయాలని గూగుల్‌ను న్యాయమూర్తి తన మధ్యంతర ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఇలాంటి వీడియోలు గూగుల్‌ దృష్టికి ఎప్పుడు తీసుకొచ్చినా.. వాటిని తొలగించాలని స్పష్టం చేశారు. ఇందుకు 36 గంటల గడువు కావాలని గూగుల్‌ తరఫు న్యాయవాది కోరారు. యూట్యూబ్‌ వేదికలపై ఇలాంటి అభ్యంతరకర సమాచారంపై వ్యవహరించే విధానానికి సంబంధించి.. గూగుల్‌ తన సవివర ప్రతిస్పందన తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని