Vande Bharat Express: ప్రారంభించిన రోజే ఆగిన కేరళ వందేభారత్‌ రైలు

కేరళలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన తొలిరోజే.. వందేభారత్‌ రైలులో లీకులు కనిపించడంతో గమ్యస్థానమైన కాసర్‌గోడ్‌ వెళ్లాల్సిన సెమీ హైస్పీడ్‌ రైలు కన్నూర్‌ రైల్వేస్టేషనులో నిలిచిపోయింది.

Updated : 27 Apr 2023 08:22 IST

కేరళలో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించిన తొలిరోజే.. వందేభారత్‌ రైలులో లీకులు కనిపించడంతో గమ్యస్థానమైన కాసర్‌గోడ్‌ వెళ్లాల్సిన సెమీ హైస్పీడ్‌ రైలు కన్నూర్‌ రైల్వేస్టేషనులో నిలిచిపోయింది. మంగళవారం ఉదయం తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌కు బయలుదేరిన రైలుకు మార్గమధ్యంలో ఎగ్జిక్యూటివ్‌ బోగీలోని ఏసీ గ్రిల్‌లో నీరు కారుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే కన్నూర్‌లో నిలిపివేసి, ఐసీఎఫ్‌కు (ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ) చెందిన సాంకేతిక నిపుణులు రైలులో మరమ్మతులు ప్రారంభించారు. మొదట్లో ఇలాంటి చిన్నపాటి సమస్యలు సాధారణమేనని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని