Rajasthan: స్వీపర్‌కు ప్రసవం చేసిన మహిళా కానిస్టేబుళ్లు

రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం ఓ స్వీపర్‌కు నలుగురు ఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుళ్లు ప్రసవం చేశారు. ప్లాట్‌ఫాంను శుభ్రం చేస్తున్న సమయంలో పూజ అనే స్వీపర్‌కు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చి విలవిల్లాడింది.

Updated : 02 Jun 2023 08:32 IST

రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌ రైల్వేస్టేషన్‌లో గురువారం ఉదయం ఓ స్వీపర్‌కు నలుగురు ఆర్‌పీఎఫ్‌ మహిళా కానిస్టేబుళ్లు ప్రసవం చేశారు. ప్లాట్‌ఫాంను శుభ్రం చేస్తున్న సమయంలో పూజ అనే స్వీపర్‌కు ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చి విలవిల్లాడింది. అక్కడే ఉన్న ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వీరేంద్రసింగ్‌ ఏఎస్‌ఐ ప్రేమారామ్‌కు ఈ విషయం ఫోనులో చెప్పారు. మహిళా కానిస్టేబుళ్లు హంసకుమారి, సావిత్రి ఫాగేడియా, లక్ష్మీవర్మలతోపాటు మరొకరు కొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పూజ ఆరోగ్య పరిస్థితి క్షీణించి రక్తస్రావం మొదలైంది. ఆస్పత్రికి తీసుకువెళ్లే సమయం కూడా లేదు. ఓ దుప్పటిని అడ్డుపెట్టి నలుగురు మహిళా కానిస్టేబుళ్లు అక్కడే ప్రసవం చేశారు. పూజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలను స్థానిక శాటిలైట్‌ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని మహిళా కానిస్టేబుళ్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని