Farmer Marriage: ఇట్టుంటాది రైతు పెళ్లంటే..

రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌ జిల్లాలో ఓ పెళ్లి కార్యక్రమం వినూత్నంగా జరిగింది. రైతు కుటుంబానికి చెందిన వరుడు ప్రకాష్‌ చౌదరి 51 ట్రాక్టర్లపై 200 మందిని పెళ్లి ఊరేగింపుగా తీసుకువెళ్లాడు.

Updated : 15 Jun 2023 07:46 IST

51 ట్రాక్టర్లతో తరలిన వరుడు

రాజస్థాన్‌లోని బాడ్‌మేర్‌ జిల్లాలో ఓ పెళ్లి కార్యక్రమం వినూత్నంగా జరిగింది. రైతు కుటుంబానికి చెందిన వరుడు ప్రకాష్‌ చౌదరి 51 ట్రాక్టర్లపై 200 మందిని పెళ్లి ఊరేగింపుగా తీసుకువెళ్లాడు. తాను కూడా స్వయంగా ఓ ట్రాక్టరు నడిపాడు. తమ కుటుంబ ప్రధానవృత్తి వ్యవసాయమని చెప్పిన ప్రకాష్‌ ఇతర వాహనాలను కాకుండా సేద్యానికి వినియోగించే ట్రాక్టర్లనే వేడుకకు వాడాలని అనుకున్నట్లు చెప్పాడు. గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్‌ చౌదరి.. వధువు మమత గ్రామమైన రోలికి ఇలా తరలివెళ్లాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని