70 అడుగుల గోతిలో ఇరుక్కుపోయిన కార్మికుడు

దిల్లీ నుంచి జమ్మూలోని కటడా వరకు చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణపనుల్లో భాగంగా తవ్విన భారీ గొయ్యి లోపల శనివారం సాయంత్రం నుంచి ఓ కార్మికుడు ఇరుక్కుపోయాడు.

Updated : 14 Aug 2023 08:40 IST

ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణపనుల్లో విషాదం

చండీగఢ్‌: దిల్లీ నుంచి జమ్మూలోని కటడా వరకు చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణపనుల్లో భాగంగా తవ్విన భారీ గొయ్యి లోపల శనివారం సాయంత్రం నుంచి ఓ కార్మికుడు ఇరుక్కుపోయాడు. పంజాబ్‌లోని జలంధర్‌ జిల్లా కర్తార్‌పుర్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకొంది. భారీ పిల్లర్‌ ఏర్పాటు చేసేందుకని ఆ గొయ్యి తవ్వారు. లోపల బోరింగ్‌ యంత్రంలో సమస్య తలెత్తడంతో ఇద్దరు కార్మికులు అందులోకి దిగారు. పై నుంచి ఇసుక పడటం గమనించి పవన్‌ అనే కార్మికుడు పైకి చేరుకోగా.. సురేశ్‌ (55) మాత్రం 70 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. ఇతడు హరియాణాలోని జీంద్‌ ప్రాంతవాసి. ఎన్డీఆర్‌ఎఫ్‌, జిల్లా అధికారుల సహాయక చర్యలు ఆదివారం కూడా కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని