దిల్లీ వర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘనవిజయం

ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ).. దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది.

Published : 24 Sep 2023 05:59 IST

దిల్లీ: ఆరెస్సెస్‌ అనుబంధ సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ).. దిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. శనివారం ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో అధ్యక్ష స్థానం సహా మూడు పదవులను కైవసం చేసుకుంది. నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ) ఒక్క సీటుకే పరిమితమైంది. ఏబీవీపీకి చెందిన తుషార్‌ దేఢా అధ్యక్ష పదవిని సొంతం చేసుకున్నారు. ఏబీవీపీకే చెందిన అపరాజిత, సచిన్‌ భైంస్లాలు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులుగా విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవి ఎన్‌ఎస్‌యూఐకి చెందిన అభి దహియాకు దక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని