Viral Video: పాముకు ప్రాణం పోసిన పోలీస్‌

అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ కానిస్టేబుల్‌ ఊపిరి ఊది ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో సేమరి హరిచంద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 28 Oct 2023 17:54 IST

అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ కానిస్టేబుల్‌ ఊపిరి ఊది ప్రాణాలు కాపాడారు. మధ్యప్రదేశ్‌లోని నర్మదాపురం జిల్లాలో సేమరి హరిచంద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్థానికంగా ఉన్న రెసిడెన్షియల్‌ కాలనీలో ఓ విషరహిత సర్పం పురుగుల మందు ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్న హరిచంద్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ అతుల్‌ శర్మ పాముపై నీళ్లు పోసి శుభ్రం చేశారు. అనంతరం సపర్యలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో చాలా సార్లు పాము అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయినా.. ఆపకుండా పాము నోట్లోకి గాలి ఊదారు. దాంతో కొద్దిసేపటికి ఆ సర్పం స్పృహలోకి వచ్చింది. అనంతరం దానిని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గత 15 సంవత్సరాల్లో తాను 500  పాములను రక్షించినట్లు ఈ సందర్భంగా అతుల్‌ శర్మ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని