జేఎన్‌.1తో భయం లేదు

కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌  అన్నారు. ఆదివారం ఆయన దక్షిణ గోవాలో పాంచజన్య వార పత్రిక నిర్వహించిన ‘సాగర్‌ మంథన్‌ 2.0 ’ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated : 25 Dec 2023 05:24 IST

కేంద్రమంత్రి శ్రీపాద్‌ నాయక్‌

పణజీ: కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌  అన్నారు. ఆదివారం ఆయన దక్షిణ గోవాలో పాంచజన్య వార పత్రిక నిర్వహించిన ‘సాగర్‌ మంథన్‌ 2.0 ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిపై దేశం గతంలోనే పోరాడిందని.. కొత్త వేరియంట్‌పై ప్రజలు, పర్యాటక పరిశ్రమకు ఆందోళన అవసరంలేదన్నారు. లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉంటుందా? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘‘భయపడాల్సిన అవసరం లేదు. అది మళ్లీ వచ్చినా మనం పోరాడగలం. గతంలోనూ మనం ఈ మహమ్మారిపై పోరాడాం’’ అని సమాధానం ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని