దిల్లీలో కొనసాగుతున్న పటిష్ఠ భద్రత!

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం 72వ రోజుకు చేరుకుంది. శనివారం జరిగిన చక్కా జామ్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పటిష్ఠ భద్రత ఆదివారమూ కొనసాగుతోంది. ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు.........

Published : 07 Feb 2021 14:09 IST

72వ రోజుకు చేరిన రైతు ఉద్యమం

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం 72వ రోజుకు చేరుకుంది. శనివారం జరిగిన చక్కా జామ్‌ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పటిష్ఠ భద్రత ఆదివారమూ కొనసాగుతోంది. ఆందోళనలకు కేంద్రంగా ఉన్న సింఘు, టిక్రీ, గాజీపూర్‌ సరిహద్దుల్లో పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. మరోవైపు చట్టాల్ని రద్దు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

శనివారం నిర్వహించిన చక్కా జామ్‌ దేశమంతటా ప్రశాంతంగా ముగిసింది. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దయ్యే వరకూ దిల్లీ సరిహద్దులను వీడేదిలేదని భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ అధికార ప్రతినిధి, రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌ ప్రకటించారు. చట్టాల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వానికి అక్టోబరు 2 వరకు గడువునిస్తున్నట్లు తెలిపారు. ‘మేం రైతులం...సైనికులం’ అనేది ఇక మీదట తమ ఉద్యమ నినాదంగా ఉంటుందన్నారు.

ఇవీ చదవండి...

రైతు పోరు ఆగదు

రైతుల గురించి జాగ్రత్తగా మాట్లాడండి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని