Indian Navy: సముద్రపు దొంగల ఆటకట్టించిన భారత నేవీ

నౌకలపై దాడి చేసి, దోచుకునేందుకు యత్నించిన సోమాలియా పైరెట్ల యత్నాలను భారత నేవీ (Indian Navy) అడ్డుకుంది. 

Published : 16 Mar 2024 13:52 IST

దిల్లీ: భారత నేవీ (Indian Navy) మరోసారి సముద్రపు దొంగల ఆటలు సాగనివ్వలేదు. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు వారు చేసిన యత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు పైరెట్లు కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన దృశ్యాలను నౌకాదళం ఎక్స్‌ (ట్విటర్) వేదికగా షేర్ చేసింది.

గత ఏడాది డిసెంబర్‌లో ex-MV Ruen నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఇతర దేశాల నౌకలను దోచుకునేందుకు దానిని ఉపయోగిస్తున్నారని భారత నేవీ గుర్తించింది. ఈ క్రమంలోనే వారున్న ఆ షిప్‌ను అడ్డగించింది. ఆత్మరక్షణ, దోపిడీకి వ్యతిరేకంగా అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారిపై చర్యలు తీసుకున్నామని చెప్పింది. ఈ క్రమంలో కొందరు పైరెట్లు ex-MV Ruen నౌక డెక్‌పైకి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. వెంటనే లొంగిపోవాలని, ఎవరైనా పౌరులు బందీలుగా ఉంటే విడిచిపెట్టాలని తాము హెచ్చరించిట్లు పేర్కొంది. తాము సముద్ర భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

బాలిస్టిక్‌ క్షిపణులు సరఫరా చేశారో... జాగ్రత్త

ఇటీవల హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌ (Bangladesh) జెండాతో ఉన్న ఓ కార్గో నౌకను హైజాక్‌ (Hijack) చేశారు. ఈ నౌక మంగళవారం హిందూ మహా సముద్రంలో ప్రయాణిస్తుండగా సముద్రపు దొంగలు అందులోకి చొరబడ్డారు. ఆయుధాలతో సిబ్బందిని బెదిరించి నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ నౌక నుంచి వచ్చిన అత్యవసర సందేశంపై మన నౌకాదళం స్పందించింది. ఈ నేపథ్యంలోనే తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని