Ramanagara: ఆ జిల్లా పేరు మారిస్తే ఆమరణ దీక్ష చేస్తా : హెచ్‌డీ కుమారస్వామి

రామనగర జిల్లా పేరును మార్చే విషయంపై ప్రభుత్వం ముందుకు వెళ్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి హెచ్చరించారు.

Published : 27 Oct 2023 01:42 IST

బెంగళూరు: కర్ణాటకలో ఓ జిల్లాకు సంబంధించి పేరు మార్పు ప్రతిపాదన అక్కడి రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. రామనగర జిల్లా పేరును మార్చే విషయంపై ప్రభుత్వం ముందుకు వెళ్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని జేడీఎస్‌ నేత, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి హెచ్చరించారు. ఆ జిల్లాతో (Ramanagara) తనకెంతో అనుబంధం ఉందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జిల్లా పేరు మార్చడానికి వీల్లేదన్నారు. ఇదే విషయంపై బహిరంగ చర్చ జరుపుదామంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ (DK Shivakumar) చేసిన సవాల్‌ని స్వీకరిస్తున్నానని.. ఏ వార్తా ఛానళ్లోనైనా అందుకు సిద్ధమేనన్నారు.

‘ఉప ముఖ్యమంత్రి చేసిన సవాలును స్వీకరిస్తున్నా. రామనగర జిల్లాతో నాకు ఎంతో భావోద్వేగ అనుబంధం ఉంది. అంతేకానీ, ఎటువంటి వ్యాపార సంబంధం లేదు. ఒకవేళ రామనగర జిల్లా పేరును మారిస్తే.. నా ప్రాణాలను పణంగా పెట్టి ఆమరణ దీక్ష చేస్తా. నా ప్రాణం ఉన్నంతవరకు ఆ జిల్లా కీర్తిని కాపాడేందుకు పోరాడుతా’ అని హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) పేర్కొన్నారు.

విచారణ సమయంలో జడ్జీల వాగ్వాదం

రామనగర జిల్లాను ‘బెంగళూరు సౌత్‌’గా మార్చే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే, 2007లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చన్నపట్న, మాగడి, కనకపురలతోపాటు రామనగర తాలుకాలు కలిపి రామనగర కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడింది. కానీ, ఇప్పుడు చన్నపట్న, రామనగర, కనకపుర, మాగడితోపాటు హరోహళ్లీని కలిపి మొత్తం ఐదు తాలుకాలతో కొత్త జిల్లా ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందుకు ‘బెంగళూరు సౌత్‌’ పేరును ప్రతిపాదిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వెల్లడించారు. దీనిపైనే మాజీ సీఎం కుమారస్వామి తీవ్రంగా స్పందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు