రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర: ఆ స్టేడియానికి వస్తే.. బాంబు పేలుస్తాం..!

ప్రస్తుతం మహారాష్ట్రలో భారత్‌ జోడో యాత్ర సాగుతోంది. నవంబర్ 20కి ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది.

Published : 18 Nov 2022 19:06 IST

ఇండోర్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న భారత్‌ జోడో యాత్రకు బాంబు బెదిరింపు వచ్చింది. రెండు రోజుల్లో ఆ పాదయాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుండగా అక్కడ బెదిరింపు లేఖ దొరకడం కలకలం రేపుతోంది. ఇండోర్‌లోని స్థానిక స్టేడియంలో జోడో యాత్రికులు బస చేస్తే.. నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

‘గురువారం సాయంత్రం జుని ప్రాంతంలోని ఒక దుకాణానికి ఒక లేఖ వచ్చింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతోన్న జోడోయాత్రలో పాల్గొనేవారు ఖల్సా స్టేడియంలో బస చేస్తే.. నగరంలో బాంబు పేలుళ్లు జరిగే అవకాశం ఉందని ఆ లేఖ సారాంశం. అయితే రాహుల్ లక్ష్యంగా చేసుకున్నట్లు దానిలో నేరుగా ప్రస్తావించలేదు. దీనిపై మేం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాం’ అని తెలిపారు. అలాగే దీన్నొక బూటకపు బాంబు బెదిరింపుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ లేఖపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అలాగే జోడోయాత్రకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. 

ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ యాత్ర సాగుతోంది. దీనిలో భాగంగా ఇటీవల ఓ సభలో హిందుత్వ సిద్దాంతకర్త సావర్కర్‌పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వాటికి నిరసనగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగాయి. ఇక నవంబర్ 20కి ఈ యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని