INSACOG: 2లక్షలకు పైగా నమూనాలకు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌..!

దేశవ్యాప్తంగా 2లక్షలకుపైగా కొవిడ్‌ నమూనాలకు సీక్వెన్సింగ్‌ చేసినట్లు కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Published : 30 Mar 2022 20:09 IST

వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గినప్పటికీ కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్‌ ఉత్పరివర్తనాలు, వాటి ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం (INSACOG) సహాయంతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2లక్షలకుపైగా కొవిడ్‌ నమూనాలకు సీక్వెన్సింగ్‌ చేసినట్లు కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన పశ్నకు కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

దేశంలో 17 కొవిడ్‌-19 జీవ వైవిధ్య నిల్వ కేంద్రాలను ప్రభుత్వం గుర్తించినట్లు కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. వీటిని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (DOB), కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (CSIR) తోపాటు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR)లకు చెందిన లేబొరేటరీలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇదిలాఉంటే, దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 ప్రాబల్యం, తీవ్రతపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్టియం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ముఖ్యంగా నిర్దేశించిన ప్రాంతాలు, ఆయా రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు పంపించే కొవిడ్‌ పాజిటివ్‌ నమూనాల జన్యుక్రమాన్ని విశ్లేషిస్తుంది. తద్వారా కొత్త వేరియంట్‌ను గుర్తించి వెంటనే ఆయా విభాగాలను అప్రమత్తం చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న ల్యాబ్‌లన్నింటనీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ సమన్వయం చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని