Pawar X Pawar: ప‘వార్‌’లో గెలుపెవరిది? ఎమ్మెల్యేల బల ప్రదర్శనపై ఉత్కంఠ!

తమదే అసలైన పార్టీ అని ప్రకటించుకుంటున్న శరద్‌ పవార్‌ (Sharad Pawar), అజిత్‌ పవార్‌ (Ajit Pawar)ల వర్గాలు ఎమ్మెల్యేల బల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాయి.

Updated : 05 Jul 2023 13:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP)లో విచ్ఛిన్నం తర్వాత ఆ పార్టీలో నేడు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమదే అసలైన పార్టీ అని ప్రకటించుకుంటున్న శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ వర్గాలు ఎమ్మెల్యేల బల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. ముంబయిలోని వేర్వేరు చోట్ల ఒకే సమయంలో వీటిని నిర్వహించడం గమనార్హం. తమకు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అజిత్‌ వర్గం పేర్కొంటుండగా.. వారికి కేవలం 13 మంది కంటే ఎక్కువ మద్దతు లేదని పవార్‌ వర్గం చెబుతోంది. ఈ క్రమంలో ఎవరిది పైచేయిగా ఉంటుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

ముంబయిలోని వైబీ చౌహాన్‌ ఆడిటోరియంలో శరద్‌ పవార్‌ వర్గం సమావేశం ఏర్పాటు చేసింది. ఇందుకు పలువురు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు శరద్‌ పవార్‌ సమావేశానికి 13 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. అదే సమయంలో ఎంఈటీ బాంద్రాలో అజిత్‌ పవార్‌ వర్గం ప్రత్యేకంగా భేటీ నిర్వహిస్తోంది. దీనికి ఎన్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నేతలు హాజరు కావాలని అజిత్‌ పవార్‌ పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు 28 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు ఐదుగురు ఎమ్మెల్సీలకు కూడా అజిత్‌ పవార్‌ సమావేశానికి వచ్చినట్లు సమాచారం. ఎన్సీపీకి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు