G20 Summit: మొదలైన జీ20 ‘వన్‌ ఎర్త్‌’ సమావేశం..!

భారత్ అధ్యక్షత వహిస్తోన్న జీ20 శిఖరాగ్ర సదస్సు( G20 Summit) ప్రారంభమైంది. సభ్య దేశాల నుంచి వచ్చిన అధినేతలను ప్రధాని మోదీ స్వయంగా ఆహ్వానించారు. 

Updated : 09 Sep 2023 14:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జీ20లో తొలి సమావేశమైన వన్‌ ఎర్త్‌ మొదలైంది. తొలుత షెడ్యూల్‌ ప్రకారం సభ్య దేశాల అగ్రనేతలు మొత్తం ఉదయం 9.20 నుంచి 10.30 వరకు సదస్సు ప్రాంగణానికి చేరుకొన్నారు. వీరికి ప్రధాని మోదీ స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు.

ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడో, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బర్టో ఫెర్నాండెజ్‌, సింగపూర్‌ ప్రధాని లీ హీన్‌ లూంగ్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, చైనా ప్రధాని లి చియాంగ్‌, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌, తుర్కియే అధ్యక్షుడు తైపీ ఎర్డోగాన్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, చివరిగా సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ రాకతో స్వాగత కార్యక్రమం ముగిసింది. సల్మాన్‌ను తీసుకొని ప్రధాని మోదీ సదస్సు వేదిక వద్దకు వెళ్లారు.

G20 Summit: జీ20 సదస్సు.. లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

తొలి సెషన్‌లో ‘వన్‌ఎర్త్‌’ పేరిట పర్యావరణ అంశాలను చర్చించనున్నారు. వాతవరణ మార్పులు, శుద్ధి ఇంధన, నెట్‌ జీరో ఉద్గారాలు వంటి వాటిపై ప్రధానంగా నేతలు సంప్రదింపులు జరుపుతారు. కర్బన ఉద్గారాలు తగ్గించేలా పరిశుద్ధ ఇంధనాల వైపు మళ్లేందుకు అవసరమైన క్లైమెట్‌ ఫైనాన్సింగ్‌ అంశం కూడా చర్చకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని