Mamata: సీఎం నివాసంలోకి ఆయుధాలతో చొరబాటుకు యత్నం.. బెంగాల్‌లో కలకలం!

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఆయుధాలతో కూడిన కారుతో చొరబడేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 21 Jul 2023 16:50 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) నివాసం వద్ద కలకలం రేగింది. ఆయుధాలతో కూడిన కారుతో లోపలికి చొరబడేందుకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని నూర్‌ ఆలంగా గుర్తించారు. కోటు, టై ధరించిన అతడు.. పోలీస్‌ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో కోల్‌కతా నగరంలోని కాళీఘాట్‌లోని మమతా నివాసం (Mamata Residence)లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. అతడిని అరెస్టు చేశారని కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు.

ఆ వీడియో చూసి గుండె బద్దలైంది: మమతా బెనర్జీ

‘ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకుని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు ఉన్నాయి. గంజాయి కూడా దొరికింది. బీఎస్‌ఎఫ్‌ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. అతడు సీఎంను కలవాలనుకున్నాడు. ఇది చాలా తీవ్రమైన విషయం. అతడి ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు యత్నిస్తున్నాం’ అని సీపీ వెల్లడించారు. అతడి వాహనాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకుగానూ మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని