Rahul gandhi: రాహుల్‌ యాత్రకు ఐదు రోజుల బ్రేక్‌..

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు తాత్కాలిక విరామం ప్రకటించారు.

Updated : 21 Feb 2024 10:30 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul gandhi) నేతృత్వంలో కొనసాగుతున్న ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఆయన కీలక సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిని సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ మీడియాకు వెల్లడించారు.

త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్‌ దిల్లీకి వెళ్లాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ సమయంలోనే ఆయన బ్రిటన్‌ పర్యటన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27, 28న కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. యాత్రను మార్చి 2న పునఃప్రారంభిస్తారని జైరాం రమేశ్‌ వెల్లడించారు. 5న మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ సందర్శించనున్నారు.

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నిక చెల్లదు

కాగా.. కేంద్రహోంమంత్రి అమిత్‌ షాపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఊరట లభించింది. ఆరేళ్ల క్రితం నాటి ఈ కేసులో యూపీలోని సుల్తాన్‌పుర్‌ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేళ.. అమిత్‌ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా నేత విజయ్‌ మిశ్ర ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని