Smriti Irani: సంప్రదాయ నృత్యకారులతో స్మృతి ఇరానీ స్టెప్పులు..!

రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో శుక్రవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భాజపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Updated : 18 Feb 2022 19:18 IST

ఇంఫాల్‌: రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మణిపూర్‌లో శుక్రవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ భాజపా తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాంగ్‌ఖీ ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్ సింగ్‌కు మద్దతుగా ఆమె ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అక్కడి సంప్రదాయ నృత్య కళాకారులతో కలిపి కాలు కదిపారు. స్థానిక వస్త్రధారణ ధరించి కళాకారులు నృత్యం చేస్తుండగా.. కేంద్రమంత్రి కూడా అంతే ఉత్సాహం స్టెప్పులు వేశారు. పక్కన ఉన్నవారంతా కేరింతలు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. అలాగే నేతలతో కలిసి అక్కడి వంటకాలను రుచి చూశారు. ఇదిలా ఉండగా.. ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 27, మార్చి 3న ఎన్నికల జరగాల్సి ఉండగా.. అక్కడి రాజకీయ పార్టీలు, స్థానికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈసీ తేదీల్లో మార్పు చేసింది. ఇప్పుడు ఫిబ్రవరి 28, మార్చి 5న రెండుదశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న కౌటింగ్ చేపట్టనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని