Abhishek Banerjee: దీదీ మేనల్లుడికి చుక్కెదురు..!

ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణను కొనసాగించవచ్చని కోల్‌కతా కోర్టు తీర్పు సరైనదేననడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్ బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. 

Updated : 10 Jul 2023 17:29 IST

కోల్‌కతా: ఉద్యోగ నియామక కుంభకోణం కేసులో ఎదుర్కొంటున్న ఆరోపణలపై ఈడీ విచారణను నిలిపివేయాలని మమతా బెనర్జీ (Abhishek Banerjee)మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ అభ్యర్థనను కొట్టివేసిన హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు విచారించింది.దీనిపై దర్యాప్తు చేయడానికి కేంద్రానికి హక్కు ఉందని ఈడీ దర్యాప్తును కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు తెలపడంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్‌ బెనర్జీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఏప్రిల్‌ 28న అభిషేక్‌ బెనర్జీ కేసును తాజా బెంచ్‌కు కేటాయించాలని కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయముర్తిని సుప్రీంకోర్టు ఆదేశించింది. బెనర్జీ కేసును కొత్తగా విచారించిన జస్టిస్‌ అమృతా సిన్హా మే  18న అతని అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో బెనర్జీ సుప్రీంకోర్టులో అప్పీల్‌ వేశారు.మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద వ్యక్తులను విచారించే అధికారాలు తమకు ఉన్నాయని ఈడీ పేర్కొంది. ఈ విచారణకు సంబంధించి ఈ నెల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.

2014-21 మధ్యకాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో  పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీ,  అర్పితా ముఖర్జీ,  పలువురు సీనియర్‌ అధికారులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  మనీ లాండరింగ్‌ కేసులో తృణమూల్‌ నాయకులను ఈడీ విచారిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని