Kailash Vijayvargiya: 43 పుషప్స్‌ తీసిన విజయ్‌వర్గియా.. వీడియో చూడండి!

భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గియా(65) లేటు వయసులోనూ తన ఫిట్‌నెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఓ కళాశాలలో జరిగిన వార్షికోత్సవానికి హాజరైన ఈ సీనియర్‌ నేత వేదికపైనే 43 పుష్‌అప్స్‌ చేసి ఔరా అనిపించారు.

Published : 19 Dec 2021 01:32 IST

భోపాల్‌: భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్‌ విజయ్‌వర్గియా(65) లేటు వయసులోనూ తన ఫిట్‌నెస్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచారు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లోని ఓ కళాశాలలో జరిగిన వార్షికోత్సవానికి హాజరైన ఈ సీనియర్‌ నేత వేదికపైనే 43 పుష్‌అప్స్‌ చేసి ఔరా అనిపించారు. విద్యార్థులు లెక్కిస్తూ, చప్పట్లతో ఉత్సాహపరుస్తుండగా.. ఆయన ఆగకుండా 43 పుష్‌అప్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ నేత జీతు జిరాతి ట్విటర్‌ వేదికగా పంచుకోగా.. అది ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. విజయ్‌వర్గియా ఫిట్‌నెస్‌ను అభినందిస్తూ పలువురు నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని