G20 Summit: జీ20 సదస్సు కోసం 300 శాతం అదనపు వ్యయమా..? కేంద్రం స్పందనిదే..!

G20 Summit: జీ20 సదస్సు కోసం ప్రభుత్వం భారీగా అనవసరపు ఖర్చు చేసిందని విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే అదంతా తప్పుడు ప్రచారమంటూ కేంద్రం ఖండించింది. 

Published : 12 Sep 2023 13:04 IST

దిల్లీ: భారత్‌ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సదస్సు(G20 Summit) ఘనంగా ముగిసింది. అయితే ఈ సదస్సుకు అనుకున్నదానికంటే ప్రభుత్వం 300 శాతం అదనపు వ్యయం చేసిందని తృణమూల్‌ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఫ్యాక్ట్ చెక్‌ (PIB Fact Check) విభాగం స్పందించింది.

‘జీ20 సదస్సు(G20 Summit) కోసం బడ్జెట్‌లో కేటాయించిన దానికంటే ప్రభుత్వం 300 శాతం అదనంగా ఖర్చు చేసిందంటూ సోషల్ మీడియా పోస్టు వెలుగులోకి వచ్చింది. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆ వ్యయంలో అధిక భాగాన్ని ఐటీబీపీ(జీ20 సదస్సు వేదిక) వంటి సుదీర్ఘకాలం సేవలు అందించే ఆస్తుల కోసం కేటాయించారు. ఆ నిర్మాణాలు కేవలం ఒక్క జీ20 సదస్సుకే పరిమితం కావు’ అని ఫ్యాక్ట్‌ చెక్‌ వెల్లడించింది.

త్వరలో పీవోకే భారత్‌లో కలుస్తుంది: వీకే సింగ్‌

జీ20 సదస్సు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.990 కోట్లు కేటాయించిందని, కానీ రూ.4100 కోట్లు ఖర్చు పెట్టిందంటూ తృణమూల్ కాంగ్రెస్(TMC) విమర్శలు చేసింది. ఇంత మొత్తం ఎక్కడికి వెళ్లిపోయిందని అడిగింది. మోదీ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వం ఈ ఖర్చు చేసిందని.. దీనిని భాజపా ఎందుకు చెల్లించకూడదని ప్రశ్నించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని