Rahul Gandhi: రాహుల్‌తో ఉన్న ‘ఆమె’.. చైనా రాయబారి కాదా..?

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో ఉన్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడమే గాక, రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియోలో రాహుల్‌ పక్కన కన్పించిన మహిళ చైనా

Updated : 04 May 2022 13:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో ఉన్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడమే గాక, రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆ వీడియోలో రాహుల్‌ పక్కన కన్పించిన మహిళ చైనా రాయబారి అని వార్తలు రావడంతో భాజపా తీవ్రంగా మండిపడింది. అయితే దీనిపై ఓ జాతీయ మీడియా సంస్థ ఫ్యాక్ట్‌చెక్‌ చేయగా.. ఆమె చైనా రాయబారి కాదని తెలిసినట్లు సమాచారం.

నైట్‌ క్లబ్‌లో రాహుల్‌తో కన్పించిన మహిళ నేపాల్‌లోని చైనా రాయబారి హౌ యాంకీ అని వైకాపా నేత విజయ్‌ సాయి రెడ్డి నిన్న ట్వీట్ చేశారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఆమె చైనా రాయబారి అని పేర్కొనడంతో ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే దీనిపై ఓ మీడియా సంస్థ ఫ్యాక్ట్‌ చెక్‌ చేయగా.. అది అవాస్తవమని తేలింది. ఆ మహిళ.. సీఎన్‌ఎన్‌ మాజీ విలేకరి సుమ్నిమా ఉదాస్‌ స్నేహితురాలని,  ఆమె నేపాల్‌ జాతీయురాలని సదరు మీడియా సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ నైట్‌ క్లబ్‌ యజమాని చెప్పినట్లు తెలిపింది. రాహుల్‌తో పాటు ఐదు, ఆరుగురు స్నేహితులు కూడా వచ్చారని, అయితే అందులో ఎవరూ చైనా దేశస్థులు లేరని క్లబ్‌ యజమాని చెప్పినట్లు పేర్కొంది. దాదాపు గంటన్నర పాటు రాహుల్‌ ఆ క్లబ్‌లో ఉన్నట్లు వెల్లడించింది.

సుమ్నిమా ఉదాస్‌ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్‌ సోమవారం కాఠ్‌మాండూ వెళ్లారు. విందులో భాగంగా రాహుల్ ఓ నైట్‌క్లబ్‌లో ఉన్న వీడియో ఒకటి నిన్న సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీంతో భాజపా తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. స్వీయ పార్టీ ‘పేలిపోతున్న’ సమయంలో ఆయన నేపాల్‌లో పబ్‌లో గడుపుతున్నారని కమలనాథులు ఎద్దేవా చేశారు. దీనిపై కాంగ్రెస్‌ మండిపడింది. స్నేహితురాలైన ఒక విలేకరి వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్‌ వెళ్లారని పేర్కొంది. ‘‘అదేమీ నేరం కాదుగా’’ అని వ్యాఖ్యానించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు