Taliban control on Afghan: ఆఫ్గాన్‌లో దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. పెద్ద నగరాల్లో జరుగుతున్న హింసతో భారీ నష్టం జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది....

Published : 13 Aug 2021 23:02 IST

జెనీవా: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆక్రమణలపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. పెద్ద నగరాల్లో జరుగుతున్న హింసతో భారీ నష్టం జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఖతార్‌లోని దోహాలో అఫ్గాన్, తాలిబన్ల మధ్య జరిగే చర్చల్లో ఈ వివాదానికి పరిష్కారం చూపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఆశాభావం వ్యక్తం చేశారు. అఫ్గాన్-తాలిబన్ల మధ్య ఈ వారంలో చర్చలు జరిగితే వివాదం పరిష్కారమవుతుందని ఆశిస్తున్నట్లు గుటెర్రస్ తెలిపారు. వివాద పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్న ఆయన.. అఫ్గాన్ పౌరులకు సహాయం చేయడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

అఫ్గానిస్థాన్‌లోని కీలక ప్రాంతాలను తాలిబన్లు వేగంగా ఆక్రమించేస్తున్నారు. తాజాగా రాజధాని కాబూల్ తర్వాత పెద్ద నగరాలైన హెరాత్‌, కాందహార్‌లను ఆక్రమించుకున్నారు. కాందహార్‌, హెరత్‌ వంటి పెద్ద నగరాలను కోల్పోవడం అఫ్గాన్‌ సేనలకు గట్టి ఎదురుదెబ్బే. దేశంలోని దాదాపు సగభాగం ఇప్పటికే తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయింది. అఫ్గాన్‌ వ్యాప్తంగా 34 ప్రావిన్షియల్‌ రాజధానులుండగా అందులో 12 తాలిబన్ల గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. మరికొద్ది రోజుల్లోనే కాబూల్‌తోపాటు మొత్తం దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామని తాలిబన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని