Unemployed teacher: టవర్​ ఎక్కి 135 రోజులుగా నిరసన.. దిగొచ్చిన ప్రభుత్వం​

పంజాబ్‌లోని కెప్టెన్ అమరీందర్​ సింగ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొబైల్ టవర్​ ఎక్కి 135 రోజులుగా నిరసన తెలుపుతున్న సురీందర్ సింగ్‌ గురుదాస్‌పుర్ ఎట్టకేలకు తన ఆందళనను విరమించారు....

Updated : 03 Aug 2021 17:47 IST

పటియాలా: పంజాబ్‌లోని కెప్టెన్ అమరీందర్​ సింగ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొబైల్ టవర్​ ఎక్కి 135 రోజులుగా నిరసన తెలుపుతున్న సురీందర్ సింగ్‌ గురుదాస్‌పుర్ ఎట్టకేలకు తన ఆందళనను విరమించారు. టవర్​ పైనుంచి కిందకు దిగారు. ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్-టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఈటీటీ-టీఈటీ) ఉత్తీర్ణులైన నిరుద్యోగుల్లో సురీందర్‌సింగ్‌ ఒకరు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న 6,635 ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. పటియాలాలోని 200 అడుగుల ఎత్తైన మొబైల్‌ టవర్‌ ఎక్కి 135 రోజులుగా నిరసన తెలుపుతున్నాడు. తాజాగా నిరుద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గింది. 6,635 ప్రాథమిక ఉపాధ్యాయుల నియామకాల కోసం పంజాబ్ ప్రభుత్వం ప్రకటనలు జారీ చేసింది.

ఈ సందర్భంగా సురీందర్‌సింగ్‌​ మాట్లాడుతూ.. ‘మా ఉపాధి కోసం చాలా కాలంగా పోరాటం చేశాం. ఈ క్రమంలో పోలీసులు చేతల్లో లాఠీ దెబ్బలు కూడా తిన్నాం. కాలువల్లో దూకి, మొబైల్​ టవర్ల ఎక్కి మా హక్కుల కోసం పోరాటం చేశాం’ అని పేర్కొన్నారు. అయితే మొబైల్​ టవర్​ పైనుంచి గురీందర్‌ను కిందకు దించే సమయానికి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. కాళ్ల మీద కూడా నిలబడలేని పరిస్థితితుల్లో ఉండటంతో వైద్యులను ఘటనా స్థలికే రప్పించారు అధికారులు. వైద్యపరీక్షల అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు