18 Pages: ఆదరణ ఆశ్చర్యపరుస్తోంది

‘‘ఈ ఏడాది వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్‌ ఫైవ్‌ ప్రేమకథల్లో ‘18పేజెస్‌’ కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు కథానాయకుడు నిఖిల్‌. ఆయన.. అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు.

Updated : 30 Dec 2022 06:59 IST

‘‘ఈ ఏడాది వెనక్కు తిరిగి చూసుకుంటే టాప్‌ ఫైవ్‌ ప్రేమకథల్లో ‘18పేజెస్‌’ (18 Pages) కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు కథానాయకుడు నిఖిల్‌ (Nikhil). ఆయన.. అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన ఈ చిత్రాన్ని పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కించారు. బన్నీ వాస్‌, సుకుమార్‌ నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి దక్కుతున్న ఆదరణ చూసి ఆశ్చర్యపోతున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు అల్లు అరవింద్‌, బన్నీవాస్‌, దర్శకుడు సూర్య ప్రతాప్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని