Jamuna: ఆ పాత్ర నేనే చేయాలని మూడేళ్లు ఎదురుచూశారు: జమున
గుండమ్మ కథ.. ఆ సినిమా పేరు వినగానే వినసొంపైన మాటలు, పాటలు, పాత్రల చిత్రీకరణ, హావభావాలు గుర్తుకు వస్తాయి. రామారావు, నాగేశ్వరరావు పాత్రల తీరు.. సావిత్రి సౌమ్యతనం, జమున అల్లరి, కొంటెతనం, గుండక్క గయ్యాళితనం కళ్లకు కనిపిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: గుండమ్మ కథ.. ఆ సినిమా పేరు వినగానే వినసొంపైన మాటలు, పాటలు, పాత్రల చిత్రీకరణ, హావభావాలు గుర్తుకొస్తాయి. రామారావు, నాగేశ్వరరావు పాత్రల తీరు.. సావిత్రి సౌమ్యతనం, జమున కొంటెతనం, గుండక్క గయ్యాళితనం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా విడుదలై ఆరవై ఏళ్లు అయిన సందర్భంగా జమున ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విషయాలన్నీ మీ కోసం!
‘గుండమ్మ కథ’ టైటిల్ చూడగానే అప్పట్లో స్పందన ఎలా ఉంది..?
జమున: ‘గుండమ్మ కథ’ సినిమా పేరు పెట్టినపుడు పెద్దగా స్పందన లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌తో అప్పటికే మాకున్న వివాదాన్ని గుండమ్మ ఆ సినిమాతో కాంప్రమైజ్ చేసింది. ఆ హీరోలతో దాదాపుగా మూడేళ్లు నేను మాట్లాడలేదు. వేరే వాళ్లయితే మునిగిపోతారు. నేను కాబట్టి వగరు, పొగరుతో మూడేళ్లు వాళ్లతో సినిమాలు చేయనని భీష్మించుకున్నాను. మీతో కాదు.. దారిన పోయే దానయ్యతోనైనా సినిమా చేస్తానని అన్నాను. ఈ క్రమంలో జగ్గయ్య లాంటి వాళ్లతో చేసి సూపర్‌హిట్ ఇచ్చా. పాత రోజుల్లో ఆత్మాభిమానం ఎక్కువ. కాంచనమాల, కన్నాంబ... తర్వాత కృష్ణవేణి, వరలక్ష్మి తరం తర్వాత మేం వచ్చాం. ఒక్కొక్కరం 20, 30 ఏళ్లు నటించాం. ఇప్పటి హీరోయిన్లు ఇలా వచ్చి అలా వెళ్తున్నారు.
ఎన్టీఆర్, ఎఎన్నార్‌తో సంబంధాలు సరిగా లేనపుడు ‘గుండమ్మ కథ’లోకి ఎలా వచ్చారు? సరోజగా మీరే చేయాలని ఎందుకు కోరారు?
జమున: ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటే ఎవరితోనైనా గొడవలు వస్తాయి. నాగేశ్వరరావుతో ఇబ్బందిపడి ఆయనతో సినిమాలు చేయలేదు. నా జోలికి రావొద్దని చెప్పా. ఏ రంగంలోనైనా స్త్రీ ఆత్మాభిమానం పొగొట్టుకోవద్దంటే సమస్యల్ని ఎదుర్కొవాలి. సరోజ పాత్ర చేయాలని నా కోసం చక్రపాణి, నాగిరెడ్డి మూడేళ్లు ఎదురుచూశారు. ఓ రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి, నేను సమావేశమయ్యాం. ఏదో చిన్న పిల్ల కాలు మీద కాలు వేసుకుందని అలా ఉంటే ఎలా.. నా గుండమ్మ మూడేళ్లుగా ఏడుస్తోందయ్యా.. చేయండని నాగేశ్వరరావుతో చెప్పారు. నిజంగా చెప్పాలంటే అది నా టాలెంట్‌కు సరిపడా పాత్రేం కాదు. మామూలు చిలిపి అమ్మాయిగా చేయాలంతే.
మీ నలుగురినే ‘గుండమ్మకథ’లో పెట్టుకోవాలని అనుకోవడంలో ‘మిస్సమ్మ’ సినిమా పాత్ర ఏమైనా ఉందా?
జమున: ఏ పాత్ర సృష్టించినా దాని స్వభావం, తీరుతెన్నులను రచయిత గమనిస్తారు. ఆ పాత్ర ఎవరూ చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తారు. సావిత్రి పొగరుగా నటిస్తే ఒప్పుకుంటారా.. ఆమె పాత్రలు సాఫ్ట్‌గా ఉండాలి. జమున ఏడుపుగొట్టు వేశాలేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారా? జమున సత్యభామలా ఉండాలనుకుంటారు. అలాంటి నటన జన్మతహ ఉండాలి. అప్పుడే పాత్రలో ఒదిగిపోతాం.
టీనేజ్‌లో కూడా అమ్మా కాఫీ అనేవారా?
జమున: అదేం లేదు. రాణిలాగా ఉండేదాన్ని. ఎందుకంటే అమ్మా, నాన్న, తమ్ముడు, మరదలు ఇంట్లో ఉండేవారు. అంతా అమ్మా చూసుకునేది. ఆమెకు క్రమశిక్షణ ఎక్కువ. నా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేవారు.
సూర్యకాంతంతో మీ అనుబంధం ఎలా ఉండేది..?
జమున: సూర్యకాంతం నాకు చాలా క్లోజ్. మంచి తల్లి అందరినీ బిడ్డల్లా చూసేది. అందరికి పెట్టేందుకు పెద్ద క్యారియర్ తెప్పించేది. దగ్గరుండి తినిపించేది.
‘గుండమ్మ కథ’ 60 ఏళ్ల సందర్భంగా కలుసుకోవడం సంతోషంగా ఉంది..? మీరేమనుకుంటున్నారు..?
జమున: అంత గొప్ప సినిమా తీసిన నాగిరెడ్డి, చక్రపాణిగారు, అందులో నటించిన అర్టిస్టులను తలచుకుంటుంటే, ఆ అనుభవాలు గుర్తుకు వస్తుంటే కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఆ సినిమాలో నటించిన రామారావు, ఎఎన్నార్, సావిత్రి, సూర్యకాంతం, ఛాయాదేవి ఎవరూ లేరు.
పూర్తి ఇంటర్వ్యూ దిగువ వీడియోలో చూడండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్‌ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్‌నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?