7Days 6 Nights: చార్మినార్‌ వద్ద ‘7 డేస్‌ 6 నైట్స్‌’ టీమ్‌ సందడి

‘7డేస్‌ 6నైట్స్‌’ (7 Days 6 Nights) సినిమా హీరోహీరోయన్లు సుమంత్‌ అశ్విన్‌ (Sumanth Ashwin), రోహన్‌, కృతికాశెట్టి, మెహర్‌ చాహర్‌ చార్మినార్‌ వద్ద సందడి చేశారు. ఎం.ఎస్‌. రాజు(MS Raju) దర్శకత్వంలో తెరకెక్కిన....

Published : 23 Jun 2022 17:06 IST

హైదరాబాద్‌: ‘7డేస్‌ 6నైట్స్‌’ (7 Days 6 Nights) సినిమా హీరోహీరోయన్లు సుమంత్‌ అశ్విన్‌ (Sumanth Ashwin), రోహన్‌, కృతికాశెట్టి, మెహర్‌ చాహర్‌ చార్మినార్‌ వద్ద సందడి చేశారు. ఎం.ఎస్‌. రాజు(MS Raju) దర్శకత్వంలో తెరకెక్కిన ‘7డేస్‌ 6నైట్స్‌’ ఈనెల 24న విడుదల కానుంది. ఇందులో భాగంగా చిత్రబృందం ప్రమోషన్స్‌లో పాల్గొంది. చార్మినార్‌ వద్దకు చేరుకుని చుట్టుపక్కల దుకాణాల్లో సందడి చేశారు. అనంతరం తినుబండారాలు, అక్కడ లభించే ప్రత్యేక ఫుడ్‌ని ఆస్వాదించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న తమ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఇక, సుమంత్‌ అశ్విన్‌.. తన తండ్రి నిర్మాతగా వ్యవహరించిన ‘ఒక్కడు’ సినిమా రోజుల్ని గుర్తు చేసుకున్నారు. చార్మినార్‌ తనకెంతో ప్రత్యేకమని అన్నారు. 2003లో మహేశ్‌ బాబు కథానాయకుడిగా విడుదలైన ‘ఒక్కడు’ సినిమా షూటింగ్‌ అధిక భాగం ఇక్కడే జరగడం విశేషం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని