
83 movie: ఓటీటీలో ‘83’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇంటర్నెట్ డెస్క్: సినీ, క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం ‘83’. 1983లో భారత క్రికెట్ జట్టు తొలిసారి వరల్డ్ కప్ సాధించడం, క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు దర్శకుడు కబీర్ సింగ్. కపిల్‌దేవ్‌గా నటుడు రణ్వీర్ సింగ్, ఆయన భార్య రోమి భాటియాగా దీపిక పదుకొణె నటించారు. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18 నుంచి నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో మొత్తం ఐదు భాషలు (తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో) స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్ 24న థియేటర్లలో విడుదలైన ‘83’ ప్రేక్షకుల, విమర్శల మెప్పు పొందింది. తాహీర్ రాజ్ భాసిన్, జీవా, కీలకపాత్రలు పోషించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున విడుదల చేశారు.