ఆదిలాబాద్‌లో అల్లు అర్జున్ సందడి

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఆదిలాబాద్‌లో సందడి చేశారు. ఆయన్ను చూసిన అభిమానులు ఫొటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. ఈ సందర్భంగా క్లిక్‌ మనిపించిన చిత్రాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. బన్నీ రఫ్‌ లుక్‌లో కనిపించడం మరో విశేషం. ఆయన ముఖం కూడా పూర్తిగా కనిపించని విధంగా జుట్టు పెరిగింది.....

Updated : 29 Feb 2024 14:18 IST

సోషల్‌మీడియాలో ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: సినీ హీరో... ‘స్టైలిష్ స్టార్’ అల్లు అర్జున్ ఆదిలాబాద్ జిల్లాతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ కథ నేపథ్యంలో సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’లో బన్ని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన ఆదిలాబాద్‌-మహారాష్ట్ర అటవీ ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో పాటు చిత్ర నిర్మాత యూనిట్ సభ్యులతో కలిసి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని సందర్శించిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హరితవనం పార్క్‌ను సందర్శించి, స్మృతివనంలో ఎర్ర చెందనం మొక్క నాటారు.

అక్కడి నుంచి జిల్లాకు పక్కనే ఉన్న మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడి పాండ్రకోడా జిల్లాలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతంలో అల్లు అర్జున్ బృందం పర్యటించింది. అయితే మార్గంమధ్యలో యువకులు, ఆయన అభిమానులు అల్లు అర్జున్ వస్తున్న విషయం తెలుసుకొని, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు.  అల్లు అర్జున్ సైతం తన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

 

‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత సుకుమార్‌-బన్నీ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా ‘పుష్ప’. శేషాచలనం అడవుల్లో ఎర్రచందనం దొంగల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లో ఆ విషయం స్పష్టంగా అర్థమైంది. రష్మిక ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతున్నారు. బన్నీ లారీ డ్రైవర్‌ పాత్రలో అలరించనున్నారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని