నిహారికని చూస్తే కన్నీళ్లు వచ్చేశాయ్‌..!

తన కుమార్తె నిహారిక, అల్లుడు చైతన్యల అభిరుచులు, ఆలోచనావిధానం దాదాపు ఒకేలా ఉన్నాయని నటుడు నాగబాబు సతీమణి పద్మజ తెలిపారు. ఇటీవల కుటుంబసభ్యుల సమక్షంలో నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే....

Updated : 29 Jun 2023 16:04 IST

మూడు రోజులు జ్వరం.. అన్నీ వాళ్లే చూసుకున్నారు

నాగబాబు సతీమణి పద్మజ

హైదరాబాద్‌: తన కుమార్తె నిహారిక, అల్లుడు చైతన్యల అభిరుచులు, ఆలోచనా విధానం దాదాపు ఒకేలా ఉన్నాయని నటుడు నాగబాబు సతీమణి పద్మజ తెలిపారు. ఇటీవల కుటుంబసభ్యుల సమక్షంలో నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌లో మూడురోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో మెగా-అల్లు కుటుంబాలు సందడి చేశాయి. ఈ నేపథ్యంలో పద్మజ పెళ్లి వేడుకల గురించి వివరించారు.

‘నా చిన్నారి కుమార్తె నిహారిక ఇప్పుడు వివాహిత అయ్యిందంటే నమ్మలేకపోతున్నాను. అందరు తల్లిదండ్రులు మాదిరిగానే మేము కూడా మా కుమార్తెకు ఘనంగా వివాహం చేయాలని భావించాం. మేము అనుకున్నట్లే జరిగినందుకు ఎంతో ఆనందిస్తున్నా. పెళ్లికి మూడు రోజుల ముందు నుంచి నాకు బాగా జ్వరం.. నా భర్త, కుమారుడు వరుణ్‌తేజ్‌.. పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ముఖ్యంగా నిహారిక మునుపెన్నడూ లేనంత సంతోషంగా ఉంది.’

‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారని అంటారు. నిహారిక-చైతన్యల జంటను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. వారిద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌. చూడముచ్చటైన జంట. వాళ్ల ఆలోచనా విధానం.. అభిరుచులు ఒకేలా ఉంటాయి. నా కుమార్తె.. ఆదర్శవంతమైన జీవితభాగస్వామిని సొంతం చేసుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నా’

‘పెళ్లి కుమార్తెను చేసిన సమయంలో నిహారిక నా నిశ్చితార్థపు చీరలో మెరిసిపోయింది. ఆ రోజు నిహారికను చూసినప్పుడు నా భర్త, నేనూ కన్నీళ్లు పెట్టుకున్నాం. అవి మాకు భావోద్వేగభరితమైన క్షణాలు. అలాగే అవే నా జీవితంలో ఓ అపురూప క్షణాలు’ అని పద్మజ వివరించారు.

ఇవీ చదవండి

నిశ్చయ్‌.. ఇవి చాలా ఖరీదు గురూ..!

నిహారిక-చైతన్య: కొత్త జంటలు కొత్తఫొటోలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని