Attack 1: ఆ నమ్మకం ఉంది

అటాక్‌-1... బాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు జాన్‌అబ్రహం నటిస్తున్న చిత్రం. దీనికి   సంబంధించిన రెండో ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఈ

Updated : 23 Mar 2022 13:48 IST

అటాక్‌-1... బాలీవుడ్‌ యాక్షన్‌ కథానాయకుడు జాన్‌అబ్రహం నటిస్తున్న చిత్రం. దీనికి   సంబంధించిన రెండో ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జాన్‌ అబ్రహం మాట్లాడుతూ... ‘‘భారత  దేశంలో రూపొందుతున్న తొలి పూర్తిస్థాయి సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రమిది. భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలు చేయడానికి కథానాయకులూ ముందుకు వస్తారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం విడుదలైన వారానికే మేం వస్తున్నాం. అయినా దేశంలో మాకు తగిన థియేటర్లు దొరుకుతున్నాయి. రాజమౌళి చిత్రాలంటే మాకు అమితమైన గౌరవం ఉంది. అలాగే మా చిత్రంపైనా మాకు నమ్మకం ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదని మేం భావిస్తున్నాం. అద్భుతమైన యాక్షన్‌ ఘట్టాలు, కళ్లు చెదిరే విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఇందులో ఉన్నాయి. యువతనే కాదు అందర్నీ ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. లక్ష్య రాజ్‌ ఆనంద్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని