జూన్‌లో నిశ్చితార్థం: ఫొటోలు షేర్‌ చేసిన కాజల్‌

జూన్‌లో తన నిశ్చితార్థం జరిగిందని అగ్ర కథానాయిక కాజల్‌ తెలిపారు. ఆమె తన ప్రియుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును వివాహం చేసుకోబోతున్నారని మొదట ప్రచారం జరిగింది. రహస్యంగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారని చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు అక్టోబరు 30న తన ప్రియుడు గౌతమ్‌ను మనువాడబోతున్నట్లు.....

Updated : 29 Feb 2024 15:21 IST

లాక్‌డౌన్‌ సమయంలో..

ముంబయి: అగ్ర కథానాయిక కాజల్‌ తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. కాగా జూన్‌లో తమ నిశ్చితార్థం జరిగిందని కాజల్‌ తాజాగా వెల్లడించారు. 

కాగా కాజల్‌ తన నిశ్చితార్థం సందర్భంగా తీసుకున్న ఫొటోల్ని సోమవారం షేర్‌ చేశారు. జూన్‌ నెలలో తన కోసం అందమైన చీర డిజైన్‌ చేసిన మనీష్‌ మల్హోత్రాకు, ఆయన బృందానికి థాంక్స్‌ చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ఏదీ సాధ్యం కాని తరుణంలో.. తన నిశ్చితార్థం చీర కోసం మనీష్‌ బృందం కష్టపడ్డ తీరును మెచ్చుకున్నారు. వారు కూడా తన వేడుకలో భాగమయ్యారంటూ తన ప్రేమను సందేశం రూపంలో పంపారు. దీనికి మనీష్‌ స్పందిస్తూ.. లవ్‌ సింబల్స్‌ షేర్‌ చేశారు.

మరోపక్క తన సతీమణి కాజల్‌ Mrs కిచ్లుగా నిద్రలేచిందంటూ గౌతమ్‌ ఫొటో షేర్‌ చేశారు. కాజల్‌ సరదా ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చిన ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంది.

తన సోదరి కాజల్‌కు నిషా అగర్వాల్‌ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పెళ్లి ఫొటో షేర్‌ చేస్తూ.. ‘నువ్వు నీ జీవితంలో కొత్త ప్రయాణం మొదలు పెట్టావు. అది అద్భుతం, క్రేజీగా, మరపురాని జ్ఞాపకంగా ఉండాలని కోరుకుంటున్నా. మీ వైవాహిక జీవితం ప్రేమతో నిండిపోవాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. ‘ధన్యవాదాలు మై బేబీ.. నిన్ను ఎంతో ప్రేమిస్తున్నా. త్వరలోనే నిన్ను కలవాలని ఆతృతగా ఉంది’ అని కాజల్‌ తన చెల్లిని ఉద్దేశిస్తూ అన్నారు. 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని