ఆ అమ్మాయి చాలా మంచిది: విజయ్‌ దేవరకొండ

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ ఇచ్చిన డిజాస్టర్‌తో విజయ్ దేవరకొండ, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన పూరీ జగన్నాథ్‌.. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. క్రీడా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరును ఇప్పటికే..

Published : 22 Nov 2020 17:52 IST

హైదరాబాద్‌: విజయ్ దేవరకొండ,  పూరీ జగన్నాథ్‌.. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా సినిమా వస్తున్న విషయం తెలిసిందే. క్రీడా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే పేరు ఇప్పటికే ఖరారు చేశారు. విజయ్‌ సరసన బాలీవుడ్‌ చిన్నది అనన్య పాండే తెర పంచుకోనుంది. ఛార్మి, కరణ్‌ జోహార్‌ కలిసి నిర్మిస్తున్నారు. అయితే.. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌.. అనన్యను పొగడ్తలతో ముంచెత్తాడు.

‘అనన్య చాలా మంచి అమ్మాయి. ఆమెను తెలుగు సినిమాల్లో చూడాలని దక్షిణాది ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమాలో ఆమె బాగా నటించింది. ఇప్పటికే సగం షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొస్తుందని గట్టిగా నమ్ముతున్నా’ అని విజయ్‌ అభిప్రాయ పడ్డాడు.
కరోనా మహమ్మారి వల్ల ఈ సినిమా షూటింగ్‌కు ప్యాకప్‌ చెప్పాల్సి వచ్చింది. క్లైమాక్స్‌ సీన్‌ మాత్రమే మిగిలిపోయినట్లు సమాచారం. ఈ సినిమా తెలుగు, హిందీ భాషాల్లో మాత్రమే కాకుండా ఇండియాలోని పలు భాషాల్లో విడుదలకానుంది. టాలీవుడ్‌‌లో మంచి క్రేజ్‌ ఉన్న హీరో, డైరెక్టర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ‘ఫైటర్‌’పై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు అనన్య సైతం బీటౌన్‌లో మంచి సినిమా ఆఫర్లు కొట్టేస్తోందట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని