AAGMC: ఫిల్మ్‌మేకర్‌, డాక్టర్‌ లవ్‌స్టోరీ.. ఆసక్తిగా ‘ఆ అమ్మాయి..’ ట్రైలర్‌

ఒక అబ్బాయి జీవితాన్ని ఓ అమ్మాయి ఎలా ప్రభావితం చేసింది? అనూహ్యంగా వారెలా ప్రేమలో పడ్డారు? ప్రేమతోపాటు వారు అనుకున్నది ఎలా సాధించారనే కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

Published : 05 Sep 2022 17:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక అబ్బాయి జీవితాన్ని ఓ అమ్మాయి ఎలా ప్రభావితం చేసింది? అనూహ్యంగా వారెలా ప్రేమలో పడ్డారు? అనే కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. సుధీర్‌ బాబు (Sudheer Babu), కృతిశెట్టి (Krithi Shetty) నాయకానాయికలు. మోహన్‌కృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రముఖ నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ని మెచ్చిన మహేశ్‌ చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ‘నేను యాక్ట్‌ చేస్తా’ అని కథానాయిక చెప్పగానే కథానాయకుడు ఆనందంలో మునిగిపోయే సన్నివేశంతో ట్రైలర్‌ ప్రారంభమై, ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

ఈ సినిమాలో కృతి శెట్టి.. డాక్టర్‌గా, సుధీర్‌.. ఫిల్మ్‌ మేకర్‌గా కనిపించనున్నారు. హీరోయిన్‌ తల్లి సినీ రంగాన్ని అసహ్యించుకునే వ్యక్తి కావటంతో నాయకానాయికల మధ్య దూరం పెరుగుతుందని, కథానాయకుడు ఓ ప్రమాదానికి గురవుతాడనే హింట్‌ ఇచ్చాయి ట్రైలర్‌లోని సన్నివేశాలు, సంభాషణలు. మరి, వేర్వేరు నేపథ్యాలున్న ఈ ఇద్దరు ప్రేమికులు ఒక్కటయ్యారా? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. (Aa Ammayi Gurinchi Meeku Cheppali)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు