Top Gear Trailer: ఇంతకీ డేవిడ్‌ ఎవరు? ఉత్కంఠగా ‘టాప్‌ గేర్‌’ ట్రైలర్‌

ఆది సాయికుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘టాప్‌ గేర్‌’. ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

Published : 18 Dec 2022 15:44 IST

హైదరాబాద్‌: ‘యుద్ధం గెలవాలంటే, మృత్యువుతో పోరాడే గెలవాలి’ అంటోంది ‘టాప్‌ గేర్‌’ చిత్ర బృందం. ఆది సాయికుమార్‌ (Aadi Saikumar) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రమిది(Top Gear). రియా సుమన్‌ (Riya Suman) కథానాయిక. కె.శశికాంత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కె.వి.శ్రీధర్‌రెడ్డి నిర్మాత. ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. కథలోని పాత్రలందరూ డేవిడ్‌, అతడి ఆచూకీ గురించి అడుగుతూ కనిపించారు. మరి ఇంతకీ డేవిడ్‌ ఎవరు? హైదరాబాద్‌లో జరిగిన పలు హత్యలకు, డేవిడ్‌కూ సంబంధం ఏంటి? క్యాబ్‌ డ్రైవర్‌ అయిన ఆదిని ఎందుకు పోలీసులు వెంటాడారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆద్యంతం ఉత్కంఠభరిత కథ, కథనాలతో సినిమాను తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని