Acharya: ‘ఆచార్య’ ట్రైలర్‌ వచ్చేసింది.. చిరు- చరణ్‌ కలిస్తే ఇలా ఉంటుంది!

‘ఆచార్య’ హంగామా మొదలైంది. ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులంతా ఆసక్తి ఎదురుచూస్తున్న ట్రైలర్‌ రానే వచ్చింది. 

Published : 12 Apr 2022 18:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆచార్య’ హంగామా మొదలైంది. ఎప్పుడెప్పుడా అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోన్న ట్రైలర్‌ వచ్చేసింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి- రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రమిది. ఏప్రిల్‌ 29న విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రచార చిత్రాన్ని కొన్ని ముఖ్యమైన థియేటర్లతోపాటు సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది చిత్ర బృందం. మెగా అభిమానులు కోరుకునే అన్ని హంగులూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. వీడియోలో చూపించిన ఈ ఇద్దరి లుక్స్‌, పవర్‌ఫుల్‌ నటన సినిమాపై మరింత ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. దర్శకుడు తనదైన మార్క్‌ కథను చెప్పబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో చిరు సరసన కాజల్‌ అగర్వాల్‌, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని