Prakash Raj: తిరస్కరణ వెనుక పాలిటిక్స్‌నీ చూశా: ప్రకాశ్‌ రాజ్‌

తాను నటుడిగా తిరస్కరణకు గురవడంపై ప్రకాశ్‌ రాజ్‌ స్పందించారు. రిజెక్షన్‌ తనపై ప్రభావం చూపలేదన్నారు.

Published : 16 Dec 2023 01:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి ఆకట్టుకునే నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj). సుదీర్ఘ ప్రస్థానమున్న ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు పంచుకున్నారు. నటుడిగా ఎప్పుడైనా తిరస్కరణకు గురయ్యారా? అని హోస్ట్‌ ప్రశ్నించగా ప్రకాశ్‌ రాజ్‌ సమాధానమిచ్చారు. ‘‘తిరస్కరణ నాపై ఎప్పుడూ ప్రభావం చూపలేదు. దాని వెనుక ఉన్న పాలిటిక్స్‌నీ నేను చూశా. అలా రాజకీయం చేసేవారిని నేను అర్థం చేసుకున్నా. వారిపై సానుభూతి కూడా ఉంది. నేను ప్రత్యేక మార్గంలో వెళ్లాలని అనుకున్నా. ముందు మనకు మనం కంఫర్ట్‌గా ఉండాలి. ఆ తర్వాత ప్రపంచం మనతో కంఫర్ట్‌గా ఉందో లేదో ఆలోచించాలి’’ అని పేర్కొన్నారు.

ఆ విషయాన్ని నేను పట్టించుకోను.. ప్రతిభను మాత్రమే చూస్తా: బాబీ దేవోల్‌

కథలు నచ్చకపోయినా డబ్బు కోసం పలు సినిమాల్లోనూ నటించానని తెలిపారు. ‘‘ప్రకాశ్‌రాజ్‌ ఎందుకు ఇలాంటి వాటిలో నటిస్తున్నావ్‌?’ అని నా మనసు అడిగేది. నాకు డబ్బు అవసరం అందుకే నటించానని చెప్పేవాడిని’’ అని అన్నారు. తనకు కమర్షియల్‌ చిత్రాలపై చిన్నచూపు లేదని, అలాంటి సినిమాలకు ఓ వర్గం ప్రేక్షకులున్నారని, మేకర్స్‌ ఉన్నారని పేర్కొన్నారు. ఏ సినిమాకైనా హార్డ్‌వర్క్‌ ఒకటేనని అన్నారు. మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’, పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’, ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాల్లో ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని