Prithiveeraj: పృథ్వీరాజ్‌తో పెళ్లి జరగలేదు.. మేమిద్దరం విడిపోయాం: శీతల్‌ పోస్ట్‌

నటుడు పృథ్వీరాజ్‌తో తనకు పెళ్లి జరగలేదని శీతల్‌ తెలిపింది. ఈమేరకు ఆమె ఓ పోస్ట్‌ పెట్టింది.

Updated : 18 Mar 2024 16:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటుడు పృథ్వీరాజ్‌ (Prithiveeraj) నుంచి విడిపోయినట్లు శీతల్‌ తెలిపింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ‘‘మాకు పెళ్లి కాలేదు. మేము కేవలం సహజీవనంలో ఉన్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల మా బంధం అనుకున్నవిధంగా ముందుకుసాగలేదు. కాబట్టి, వేర్వేరుగా ముందుకుసాగాల్సిన సమయం వచ్చింది. మా నిర్ణయాన్ని గౌరవించి దయచేసి మాకు కాస్త సమయం ఇవ్వండి’’ అని పోస్ట్‌ పెట్టింది.

‘పెళ్లి’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’ చిత్రాలతో తెలుగు వారిని అలరించిన నటుడు పృథ్వీరాజ్ (Prithiveeraj)‌. ప్రస్తుతం టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ వరుస చిత్రాల్లో నటిస్తోన్న ఆయన.. శీతల్‌ అనే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నానని రెండేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘శీతల్‌తో రిలేషన్‌లో ఉన్నా. ఆమె వయసు 24 ఏళ్లు. నా భార్య బీనాతో కొన్నేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. దాంతో ఆమెకు దూరంగా వచ్చి ఒంటరిగా ఉంటున్నా. ఒంటరితనం వల్ల కుంగుబాటుకు గురయ్యా. అలాంటి సమయంలో శీతల్‌తో పరిచయమైంది. మా అభిరుచులు కలిశాయి.’’ అని ఆయన చెప్పారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇన్‌స్టా వేదికగా ఫొటోలు షేర్‌ చేసి తమ ప్రేమను వ్యక్తపరుచుకున్నారు. ఇటీవల తమ ఖాతాల నుంచి వాటిని తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని