Omicron: సినీనటి శోభనకు ఒమిక్రాన్‌.. ఏయే లక్షణాలు ఉన్నాయంటే?

సీనియర్‌ నటి, భరతనాట్యం కళాకారిణి శోభన ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా .....

Published : 10 Jan 2022 17:09 IST

ముంబయి: సీనియర్‌ నటి, భరతనాట్య కళాకారిణి శోభన ఒమిక్రాన్‌ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. తనకు కీళ్ల నొప్పులు, చలిజ్వరం ఉన్నట్టు ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పేర్కొన్నారు. వ్యాక్సిన్లు వేసుకున్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా తనకు ఈ కొత్త వేరియంట్‌ సోకిందని తెలిపారు.  ‘జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్‌ బారిన పడ్డాను. ప్రస్తుతం కీళ్ల నొప్పులు, చలి జ్వరం, గొంతు నొప్పి ఉన్నాయి. తొలిరోజు ఈ లక్షణాలు ఉన్నప్పటికీ క్రమంగా తగ్గుతున్నాయి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వివరించారు. అయితే, తాను కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్నానని.. ఇప్పటికీ వ్యాక్సిన్‌ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఈ వేరియంట్‌తోనే మహమ్మారి ముగింపు దశకు చేరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు శోభన తెలిపారు. చెన్నైకి చెందిన 51ఏళ్ల శోభన మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోని అనేక చిత్రాల్లో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని