Vijay Deverakonda: ఈ విజువల్‌ గురించి ఎప్పటి నుంచో వేచి చూస్తున్నా: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రం ‘ఖుషి’. సినిమా శుక్రవారం విడుదలకానున్న సందర్భంగా విజయ్‌ తన మనసులో మాట పంచుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక వీడియో పోస్ట్‌ చేశారు.

Published : 01 Sep 2023 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) నటించిన తాజా చిత్రం ‘ఖుషి’ (Kushi) కొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియో పంచుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత ప్రేక్షకులంతా నవ్వుతూ థియేటర్ల నుంచి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజువల్‌ గురించి తాను చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ నెటిజన్లు, ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. తామూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు.

అప్పుడే పెళ్లి చేసుకుంటా.. ఆ విషయం ఎవరికీ చెప్పను: విజయ్‌ దేవరకొండ

‘టక్‌ జగదీష్‌’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కించిన చిత్రమిది. సమంత (Samantha) కథానాయిక. విభిన్న ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాలో విప్లవ్‌గా విజయ్‌, ఆయన భార్య ఆరాధ్యగా సమంత (Samantha) సందడి చేయనున్నారు. మురళీశర్మ, సచిన్‌ ఖేడ్కర్‌, రోహిణి, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న ఓ సమస్యను ఈ సినిమాలో ప్రస్తావించినట్లు దర్శకుడు ఇటీవల ఓ ఇంటర్వ్యలో తెలిపారు. హిందూ- ముస్లింల గొడవల ప్రస్తావనే ఉండదని స్పష్టం చేశారు. కథలో కొత్తదనం తీసుకురావడం కోసమే కశ్మీర్‌ బ్యాక్‌డ్రాప్‌ను తీసుకున్నట్లు చెప్పారు. కొందరు అనుకుంటున్నట్లు ఈ సినిమా కథకు, సమంత వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని