Vishal: షూటింగ్‌లో గాయపడ్డ నటుడు విశాల్‌

‘లాఠీ’ సినిమా చిత్రీకరణలో నటుడు విశాల్‌ గాయపడ్డారు. చికిత్స కోసం కేరళ పయనమయ్యారు.

Published : 12 Feb 2022 02:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘లాఠీ’ సినిమా చిత్రీకరణలో నటుడు విశాల్‌ గాయపడ్డారు. దీంతో చికిత్స కోసం కేరళ పయనమయ్యారు. ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘‘లాఠీ’ సినిమా స్టంట్‌ సీక్వెన్స్‌ చేస్తుంటే గాయాలయ్యాయి. విశ్రాంతి, చికిత్స కోసం కేరళ వెళ్తున్నా. మార్చి తొలివారంలో ఈ సినిమా తుదిదశ షెడ్యూల్‌లో పాల్గొంటా’’ అని విశాల్‌ తెలిపారు. విశాల్‌ చేతి ఎముకలకు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో ఆయన పోలీసు అధికారిగా కనిపించారు. ఓ బాలుడ్ని రక్షించే సన్నివేశం ఇది. ఈ చిత్రాన్ని పవర్‌ఫుల్‌ పోలీసు కథతో ఎ. వినోద్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో సునయన కథానాయిక. రమణ, నంద నిర్మాతలు. ఈ చిత్రానికి సామ్‌ సీఎస్‌ సంగీతం అందిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని